AP Politics: రాక్షసుడి పాలనలో న్యాయం ఎక్కడుంది: మాజీ మంత్రి అయ్యన్న

వైసీపీపై టీడీపీ మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్‌ అయ్యారు. ఏపీలో రాక్షసుడి పాల సాగుతుందని ఆరోపించారు. విశాఖలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయం ఎక్కడ ఉందని ప్రశ్నించాడు. శాడిస్ట్ పరిపాలన ఏ వర్గానికి మర్యాద లేదు.. ఖాకీలకు కూడా గౌరవం లేదని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఎంతో ముఖ్యమంత్రిల దగ్గర నేను పనిచేశా.. ఇలా పాలన నేను ఎక్కడ చూడలేదన్నారు.

New Update
AP Politics: రాక్షసుడి పాలనలో న్యాయం ఎక్కడుంది: మాజీ మంత్రి అయ్యన్న

సీఐడీ, డీజీపీ ఆదేశిస్తే...వీళ్ళు అరెస్ట్‌లు చేసేస్తారా..? అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులను ప్రశ్నించారు. చట్టాలు ఈ పోలీసులకు తెలియదా అంటూ ఫైర్‌ అయ్యారు. ఈ రోజు నాపై 5 కేసులు పెట్టారు. కొడతారా..? చంపేస్తారా...? రెడీ చంపేయ్యండి అంటూ సవాల్‌ చేశారు. మహిళ మంత్రి రోజా ఎన్నో సార్లు దుర్మార్గంగా మాట్లాడ లేదా? మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం.. కేసు పెట్టు దమ్ము పోలీసులకు ఉందా? అని సవాల్ విసిరారు. మేము కేసులు పెడతాం.. రోజాని అరెస్ట్ చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ తప్పులు మీ పిల్లలపై ప్రభావం

41 నోటీస్ అంటే ఎంటో కూడా ఈ పోలీసులకు తెలియదా..? 65 సంవత్సరాల దాటినా సీనియర్ సిటిజన్ బండారు సత్యనారాయణ విషయంలో 41 నోటీస్ ఇవ్వకూడదు.. ఇచ్చినా.. ఇంటి దగ్గర ఎంక్విరీ చెయ్యాలని చట్టం చెబుతోందన్నారు. ఖాకీ డ్రెస్‌లో మీరు చేసే తప్పులు మీ పిల్లలపై ప్రభావం పడతాయ్ అంటూ వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ లాంటి వారే.. NTRని ఏమి చేయలేక చేతులెత్తేసిందన్నారు. బండారు భార్య పరవాడ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే.. గంట కూర్చో బెట్టారన్నారు. కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వలేదన్నారు. జగన్ ఈ రాష్ట్రానికి ఏమి చేసావో..? ఒక్కటైన చెప్పాలని డిమాండ్‌ చేశారు. దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. జగన్ రాష్ట్రానికి చెసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి పోలీసులు లేకుండా ప్రజల మధ్యకు వస్తే నీ భవిషత్ అప్పుడే తెలుస్తుందన్నారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే మీకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

హైకోర్టులో ఫిర్యాదు చేస్తాం

రాష్రంలో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా..? అంటూ ఘాటుగా స్పందించారు. సందుల్లో 144సెక్షన్ ఏంటో జగన్‌ చెప్పాలన్నారు. టీడీపీని తక్కువ అంచనా వేస్తున్నారు.. నీ మేడలు వంచటం ఖాయమని చంద్రబాబుకి మేము ఎప్పుడో చెప్పమని అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీకి రాజకీయాన్ని సమాధి కట్టాల్సిన సమయం దగ్గరలోనే ఉందన్నారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని అయ్యన్న పిలుపునిచ్చారు. 'బండారు గారికి బాగాలేదు.. షుగర్ పెరిగింది' హాస్పిటల్‌కి వెళ్తామన్నా వెళ్లనివ్వడం లేదన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే.. డీఎస్పీ బాధ్యత వహిస్తారా..? అంటూ ప్రశ్నించారు. 5 కోట్ల జనాభా కోపాన్ని.. పోలీసులు తట్టుకోలేరు అంటూ అయ్యన్న పాత్రుడు సీరియస్‌ అయ్యారు. టీడీపీ కుటుంబాన్ని అక్రమ నిర్భంధం చేస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తప్పు చేస్తే శిక్ష వేయండి అంతేకానీ.. చట్టాలు ఉల్లంఘన చేయవద్దన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు