AP: జగన్మోహన్ రెడ్డి కాదు.. లెవన్ రెడ్డి.. అందుకే నిన్న జైలుకు వెళ్లాడు : శ్రీనివాసులు రెడ్డి

జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. త్వరలో ఆయన జైలుకెళ్తాడని ముందే గ్రహించి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో వసతులు చూసేందుకు జగన్ వెళ్లాడంటూ ఆయన సెటైర్లు వేశారు. ఆయన 11 సీట్లకే పరిమితమైన లెవన్ రెడ్డి అంటూ ఎద్దేవ చేశారు.

AP: జగన్మోహన్ రెడ్డి కాదు.. లెవన్ రెడ్డి.. అందుకే నిన్న జైలుకు వెళ్లాడు : శ్రీనివాసులు రెడ్డి
New Update

Kotam Reddy Srinivasulu Reddy: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లుగా అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదని.. 11 సీట్లకే పరిమితమైన లెవన్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను మొదటి నెల నుంచే చంద్రబాబు అమలు చేస్తున్నారని వెల్లడించారు.

స్వాతంత్ర సమరయోధుడా..

ఈవీఎం లను ధ్వంసం చేసిన క్రిమినల్ ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రూ. 25 లక్షల ఖర్చు పెట్టుకుని నెల్లూరుకు వచ్చారని విమర్శించారు. అవినీతిపరుడు, క్రిమినల్ గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా అంటూ ప్రశ్నించారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడని ముందే గ్రహించి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో వసతులు చూసేందుకు జగన్ వచ్చాడంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:  హీరో రాజ్‌తరుణ్‌పై లవర్‌ లావణ్య సంచలన ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని, వదిలేసి వెళ్లిపోయాడంటూ!

ఆర్థిక ఉగ్రవాది..

రాష్ట్రాన్ని లెవన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అంటూ కోటంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యవస్థము చేసాడని మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది కాబట్టే.. అయన కళ్ళకి పిన్నిలి రామకృష్ణ రెడ్డి మంచోడుగా కనిపిస్తున్నాడని అన్నారు. పరిపాలన చేతగాని జగన్.. సమర్థత కల్గిన చంద్రబాబుపై విమర్శలు చెయ్యడం సిగ్గు చేటు అన్నారు. తనను కారుతో గుద్దించి.. హత్య చెయ్యాలనుక్కునది మీ పార్టీ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు.

వణికిపోతున్నాడు..

జగన్ బతుకు ఏంటో ఎన్నికల్లో తెలిసిపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే జగన్ నెల్లూరులో అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబులను చూసి జగన్ భయపడి, వణికి పోతున్నాడని ఏద్దేవా చేసారు. జైలు ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుమోటోగా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.

#jagan #kotam-reddy-srinivasulu-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి