Kollu Ravindra: "శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది"

మచిలీపట్నంలో పేర్నినానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. గోతికాడ నక్కలా ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్న చరిత్ర దాస్తే దాగేది కాదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి అభివృద్ధి ఎలా తెలుస్తుంది అని ధ్వజమెత్తారు.

New Update
Kollu Ravindra: "శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది"

TDP Kollu Ravindra: మచిలీపట్నంలో పేర్నినాని పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కరోనాలో శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి నేను ఏమీ సేవ చేసానో ఎలా తెలుస్తుంది అని కామెంట్స్ చేశారు. పేర్ని నానికి కొత్తగా బందరు ప్రజల మీద ప్రేమ పుట్టినట్లు కరోనాలో తండ్రి కొడుకులు తేగ సేవ చేశామని చెబుతున్నాడని కౌంటర్లు వేశారు. గోతికాడ నక్కలా ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్న చరిత్ర దాస్తే దాగేది కాదని ధ్వజమెత్తారు.

Also Read: దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

"మాపై అక్రమ కేసులు పెట్టి కరోనా సమయములో మా నాయకుల్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన, పదవులు లేకపోయినా, అధికారం లేకపోయినా, బందరు ప్రజల కోసం చిత్తశుద్ధితో ప్రాణాలను సైతం అడ్డుపెట్టి బందరు ప్రజలకు అండగా నిలబడ్డారు. సేవ చేసే దాంట్లో థెరిసా వారసులు తుఫాన్ అప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు? సమాధానం చెప్పమంటే నాకొడుకు ప్రజాసేవలో తరిస్తున్నాడంటావ్.. నిన్ను ఎమ్మెల్యే గా గెలిపించారా? నీ కొడుకును గెలుపించారా? అని ధ్వజమెత్తారు.

Also Read: చంద్ర‌బాబు రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు

ప్రజాసేవకు పేటెంట్ మాదే అనే మీరు.. తుఫాను వచ్చి 15 రోజులు అవుతున్న ఇప్పటివరకు మీ ప్రజాసేవ ముసుగులో చేసిన సహాయం ఏంటో ప్రజలకు చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. రేపే అధికారంలోకి వచ్చాక కరోనా సేవ పై కూడా దర్యాప్తు చేద్దామన్నారు. ప్రజాసేవ ముసుగులో మీరు చేసిన అవినీతి బాగోతం, పిపీఏ కిట్లు, వ్యాక్సిన్లు దొంగ సెంటర్లు.. మొత్తం బందరు ప్రజల ముందు పెడదాం అని ధీమ వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు