సామాజిక బస్సుయాత్ర కాదు..దగా కోరుల దండయాత్ర.! వైసీపీ సామాజిక బస్సుయాత్రపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు. " ఇది దగా కోరుల దండయాత్ర.. ఏ వర్గానికి న్యాయం చేయలేదు.. 74 మంది బీసీలను హతమార్చిన ప్రభుత్వం ఇది.. ఇలాంటి నాయకులకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హతే లేదు" అని ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 05 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి TDP Kalava Srinivasulu: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మోసగాల్లు అంత కలిసి నయవంచన అనే సామాజిక బస్సుయాత్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి మూలమైన విలన్ గా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ వర్గానికి న్యాయం చేయలేదని.. 74 మంది బీసీలను హతమార్చిన ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. Also Read: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు? ఎమ్మెల్సీ అనంత బాబు దళిత యువకుడుని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారని..ఇలాంటి నాయకులకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత లేదని మండిపడ్డారు. ఈ వైసీపీ ప్రభుత్వం పథకాలన్నీ రద్దు చేసిందని.. ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం కూడా యాత్రలో ఉన్న నాయకులకు లేదని ఫైర్ అయ్యారు.ఇది కేవలం రెడ్ల ప్రభుత్వం అన్నారు. రెడ్ల చేతిలో నలుగుతున్న ప్రభుత్వం ఇది అని విమర్శలు చేశారు. బీసీ మంత్రులు దద్దమ్మలుగా ఉన్నారని ఎద్దెవ చేశారు. ముఖ్యమంత్రి కాళ్లకు దండమ్ పెడుతున్నారని..రెడ్ల దగ్గర బానిసలుగా మంత్రులు బ్రతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్ వైసీపీ మంత్రులు చేస్తున్నది సామాజిక యాత్ర కాదని..దగా కోరుల దండయాత్ర అని..మోసగాల్లు అంత కలిసి చేస్తున్న నయవంచన యాత్ర అని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నయవంచన యాత్ర నమ్మవద్దని సూచించారు. దళితలు, మహిళలపై దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంకు ప్రజలు గట్టి బుద్దిచెప్పాలని కోరారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి