/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TDP-JANASENA-BJP.jpg)
TDP-Janasena-BJP: ఏపీలో కూటమి మధ్య పదవుల పంపకాలు షురూ అయ్యాయి. నామినేటెడ్ పోస్టులను పార్టీ బలాలను బట్టి పంచుకోవాలని కూటమి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి 60% జనసేనకు 30%, బీజేపీకి 10 % పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే ఫార్ములా అనుసరించనున్నట్లు పార్టు వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీకి 50%, టీడీపీ, జనసేనకు కలిపి 50 % ఇచ్చేలా అంగీకారానికి కూటమి నేతలు వచ్చినట్లు సమాచారం. టెలికాన్ఫరెన్స్‌లో నేతలకు జనసేన పెద్ద క్లారిటీ ఇచ్చినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.