TDP Meenakshi Naidu: ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదోని MLA సాయిప్రసాద్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి అక్రమాలు చేస్తున్నాడని టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసే ముందు స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. By Jyoshna Sappogula 31 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి TDP Meenakshi Naidu: పత్తికొండ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదోని MLA సాయిప్రసాద్ రెడ్డిపై విమర్శల వర్షం గుప్పించారు. ఈ నేపధ్యంలో MLA తనయుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ తన ఫేస్ బుక్ లో కౌంటర్ ఇచ్చారు. 2 ఎకరాల చంద్రబాబు వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? త్వరలో మళ్ళీ జైలుకు వేళతాడని మరికొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ అప్లోడ్ చేశారు. అయితే, దీనికి కౌంటర్ గా ఆదోని TDP ఇంచార్జ్ మీనాక్షి నాయుడు MLA పై ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తారు. Also Read: టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడానికి కారణం ఇదే..! చంద్రబాబు పై ఆరోపణలు చేసే ముందు తన స్థాయి ఎరిగి మాట్లాడాలని హితవు పలికారు. ఆదోని MLA సాయిప్రసాద్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి అక్రమాలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు గురించి ఎవరూ పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం మంచిది కాదని హెచ్చరించారు. TDP నాయకులు, కార్యకర్తలు అదుపులో ఉన్నారని వారిని వదిలితే మీరు తట్టుకోలేరని కామెంట్స్ చేశారు.మీరు చేసే అక్రమాల వల్ల మీ నాయకులే నష్టపోతున్నారని గుర్తించండని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. Also Read: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలి నాని కౌంటర్..! SC, ST, BC MLA లను మార్చినట్టు రెడ్డి సామాజిక వర్గంలో ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. మాట వినని అధికారలను ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మీదే అని అందరికి తెలుసన్నారు. ఇసుక, గ్రావెల్, బెట్టింగ్ , రేషన్ బియ్యం, మట్కా, రియల్ ఎస్టేట్ పేరుతో కబ్జాలు నిజం కాదా..? అని ప్రశ్నించారు. మొదటి సారి MLA అయినప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పటి పరిస్థితి ఏంటని అందరికి తెలుసన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. అది తెలుసుకొని MLA తనయుడు కూడా మాట్లాడాలని సూచించారు. నన్నేమన్నా పట్టించు కోలేదు, కానీ చంద్రబాబు , లోకేష్ లపై తప్పుడు వ్యాఖ్యలు చెస్తే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఆదోని ప్రజలు మీకు , మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యనించారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి