Gorantla Butchaiah: 'ప్రభుత్వం మారగానే మొదట జైలుకు వెళ్ళేది సజ్జలనే'

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య. సజ్జల ఒక గాడిదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మారగానే మొదట జైలు కు వెళ్ళేది సజ్జలనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
TDP: కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్.. అధికారం కూటమిదే..  బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

TDP Gorantla Butchaiah Chowdary comments: వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్న భిన్నం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై విమర్శలు గుప్పించారు. సజ్జల ఒక గాడిదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మారగానే మొదట జైలు కు వెళ్ళేది సజ్జలనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన వైఫల్యాలను మంత్రులు, ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్నారని విమర్శించారు. చివరకు మంత్రులకు కూడా స్ధాన చలనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్‌.. ఎందుకంటే?

ఈ క్రమంలోనే తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో టీడీపీ సిట్టింగ్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఉన్న టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖాయమని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం పార్టీ కోసం కష్టపడి త్యాగం చేసిన వాళ్ళకే సీటు ఉంటుందని తెలిపారు. సర్వేలు అనేవి అన్ని పార్టీల్లోనూ ఉంటాయన్నారు. అయితే, తాను ఎక్కడ ఉన్నానో అక్కడే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూరల్ నీ పటిష్టం చేస్తానని ధీమ వ్యక్తం చేశారు.

ఏపీలో ఎప్పుడూ లేనంతగా ఓటింగ్ జరగబోతుందన్నారు గోరంట్ల బుచ్చయ్య. జగన్ ప్రభుత్వంపై నవతరం, యువత, మహిళలు పోరాటం చేయబోతున్నారని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై విజ్ఞప్తులు యువగళంలో లోకేష్ కి వచ్చాయని..అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తారని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు