Sunil IPS: ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ సునీల్‌కు టీడీపీ షాక్

ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ సునీల్‌కు టీడీపీ షాకిచ్చింది. తనపై నమోదైన కేసుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని టీడీపీ తప్పుబట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుపై ఈ రకమైన పోస్టులు పెట్టడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమే అని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

New Update
Sunil IPS: ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ సునీల్‌కు  టీడీపీ షాక్

Sunil IPS: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయమై X వేదికగా స్పందించారు సునీల్. సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఏమనాలంటూ సునీల్ కుమార్ కామెంట్ చేశారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పందించారు. సోషల్ మీడియాలో సునీల్ ఈ విధంగా పోస్ట్ పెట్టడాన్ని టీడీపీ తప్పుబట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుపై ఈ రకమైన పోస్టులు పెట్టడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆల్ ఇండియా కండక్ట్ రూల్సలోని రూల్ నెంబరు 7ను ఉల్లంఘించడమే అని తెలిపాయి. సునీల్ పోస్ట్ పై ప్రభుత్వానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సునీల్ పోస్టింగును పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు