TDP Ganta Srinivasa Rao: విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. భారీ మెజార్టీతో కూటమి ఘటన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో కనీసం 30 సీట్లు సాధిస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయని.. జూన్ 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. వైసీపీ కంచుకోటలో కుసాలు కదిలిపోతున్నాయన్నారు.
Also Read: అలా అనడానికి సిగ్గులేదా.. పవన్ పై రెచ్చిపోయిన ముద్రగడ..!
ఓటమి భయంతోనే..
ఈ క్రమంలోనే సీఎం రమేష్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వారి అనుచరులు వెంటపడి కార్లు ధ్వంసం చేసి దాడి చేశారన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. జగన్ ఫ్రస్టేషన్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. ఎన్నికల కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాలెన్స్ చేస్తాం..
కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సంక్షేమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని.. సంపద సృష్టించడం తోపాటు సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను.. అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. భీమిలి నియోజకవర్గం లోకల్ మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పొత్తు అని.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.