Damacharla Janardhana Rao: ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ బీఎల్ఓలపై మండిపడ్డారు. డెత్ సర్టిఫికేట్ లు ఇస్తేనే ఓట్లు తొలగిస్తామని బీఎల్ఓలు అంటున్నారని..మరణించిన వారి కుటుబం సభ్యులు లెటర్ లు ఇచ్చినా వాటిని బి.ఎల్.ఓ లు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఎంట్రీలు, డెత్ ఓటర్స్, గుర్తు తెలియన వ్యక్తుల పేర్లతో నియోజకవర్గంలో 18,000 ఓట్లు ఉన్నాయని వాటిని అధికారులు తొలగించాలని కోరారు. ఒంగోలులోని ఓటర్ లిస్టులో అవకతవకలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని కలిసిన దామచర్ల.. డోర్ డోర్ వెరిఫై చేసి నకిలీ ఓటర్ల వివరాలను జిల్లా కలెక్టర్ కి ఇచ్చామని తెలిపారు. ఈ వివరాలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నామన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి రాజీనామా!.. రాహుల్ గాంధీతో భేటీ, కేబినెట్ కూర్పుపై చర్చ
మరోవైపు, తుపాను ప్రభావంతో సంతనూతలపాడు, కొండపి, ఒంగోలు, పర్చూరు ప్రాంతాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. పొగాకు, శనగ, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొత్తపట్నం సముద్ర తీరప్రాంతంలో మత్స్యకారుల వలలు కొట్టుకుపోయాయని, పడవలు దెబ్బతిన్నాయని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే?