తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!

ఏలూరు జిల్లాలో టీడీపీ చింతమనేని ప్రభాకర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రాపురం లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆపై దౌర్జన్యంగా గొర్రెలను ఎత్తుకెళ్లాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!
New Update

TDP Chintamaneni Prabhakar:  ఏలూరు జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుని ఏ మాత్రం మారలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడైన గొర్రెల కాపరిపై అమానుషంగా దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దాడి చేసిన ఆనంతరం దౌర్జన్యంగా గొర్రెలను ఎత్తుకెళ్లాడని అంటున్నారు. ఈ ఘటనతో చింతమనేని తీరు ఏ మాత్రం మారలేదని మరోసారి రుజువైందంటున్నారు స్థానిక ప్రజలు.

Also Read: అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి.. ప్రపంచాన్ని జయించి..! తలరాతను మార్చిన వీరులు వీరే!

అసలేం జరిగిందంటే.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన జీడి మొక్కల దగ్గరకి 4 గొర్రెలు వెళ్లాయంటూ, అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి, లక్ష్మీనారాయణను దుర్భాషలాడుతూ అతడిని కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా తన గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎత్తుకెళ్లాడని లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు.

Also Read: కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు మాత్రమే తెలుసు.!

ఎవడొస్తాడో చూస్తానని, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ చింతమనేని బెదిరించాడని, ఈ సంఘటనకు అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలే సాక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశాడు గొర్రెల కాపరి, బాధితుడు లక్ష్మీనారాయణ. ఈ సంఘటన తెలిసిన వెంటనే, దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం ప్రెసిడెంట్ శ్రీ మట్టా శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీయగా, తాను కొట్టలేదని చెబుతూ, మెల్లగా జారుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడికి అండగా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గౌడ సంఘం నాయకులు తదితరులు.

#tdp-chintamaneni-prabhakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe