Chandrababu: మరో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

New Update
Chandrababu: మరో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు

బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే రెండు నెల పాటు దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ కూడా లాంచ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల వేళ మరింత ఉత్సాహంగా పని చేసేలా నేతలకు దిశానిర్దేశం చేశారు.

లిక్కర్ స్కాం నిందితుడికి చోటు ఇవ్వడంపై ఆగ్రహం..

ఇప్పటికే బాదుడే-బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్రవ్యాప్త పర్యటన చేపట్టారు చంద్రబాబు. గత మహానాడులో ప్రకటించిన భవిష్యత్‌కు గ్యారంటీ హామీలపై ప్రజలకు మరింత వివరించేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ అధినేత.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై ఘాటుగా స్పందించారు. లిక్కర్ స్కాంలో ఉన్న వ్యక్తికి పవిత్రమైన టీటీడీ పాలకమండలిలో ఎలా చోటు కల్పిస్తారని మండిపడ్డారు. టీటీడీ సభ్యల నియామకం సహా ప్రభుత్వం చేస్తున్న అన్ని తప్పిదాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

ఇసుక సత్యాగ్రహం పేరుతో ఆందోళన..

98 శాతం హామీల అమలంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారని.. ఉచిత విద్యుత్ విషయంలో రైతులనూ ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను పెంచమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఇసుక సత్యాగ్రహం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. నా ఇసుకపై నీ పెత్తనం ఏంటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపు ఇచ్చారు. భవిష్యత్తులో వైసీపీ నేతల బట్టలిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. జగన్ గ్యాంగ్ రూ. 40 వేల కోట్ల విలువైన ఇసుకను దోచేశారని ఆరోపించారు. పోలవరాన్ని ఆపేశారు.. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు.. రాజధాని ఏదంటే ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు చంద్రబాబు.

ఈనెల 28న ఢిల్లీకి చంద్రబాబు..

మరోవైపు ఏపీలో జరుగుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతగా వ్యవహరించడం లేదని.. ఓట్ల తొలగింపునకు సంబంధించి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని… అందులో భాగంగానే సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆ పార్టీ చెబుతుంది. ఇందులో భాగంగా ఈనెల 28న చంద్రబాబుతో పాటు ముఖ్య నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనుంది.

ఇది కూడా చదవండి: ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు