Chandrababu: ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా హస్తిన చేరుకున్నారు. రేపు (ఆగస్టు 28) రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Chandrababu: ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..?
New Update

చంద్రబాబు, బాలయ్య, జూ.ఎన్టీఆర్‌కు ఆహ్వానం..

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా హస్తిన చేరుకున్నారు. రేపు (ఆగస్టు 28) రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వంద రూపాయల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక నాణేన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్రపతి భవన్ వర్గాలు చంద్రబాబుకు ఆహ్వానం పంపాయి. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందింది. మరి ఆ కుటుంబం నుంచి ఎవరెవరు ఈ కార్యక్రమానికి వెళ్తారో ఇంకా తెలియరాలేదు.

నాకు ఆహ్వానం పంపాలని లక్ష్మీపార్వతి డిమాండ్.. 

ఇదిలా ఉంటే తనకు కూడా ఆహ్వానం పంపాలని వైసీపీ నేత, ఏపీ తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి కూడా డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భార్యను కాబట్టి ఆయన చిత్రంతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే హక్కు తనకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఆమె లేఖ రాశారు. అయితే దీనిపై వారు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు..

మరోవైపు ఏపీలో జరుగుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతగా వ్యవహరించడం లేదని.. ఓట్ల తొలగింపునకు సంబంధించి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని… అందులో భాగంగానే సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆ పార్టీ చెబుతుంది. ఇందులో భాగంగా ఈనెల 28న చంద్రబాబుతో పాటు ముఖ్య నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనుంది. ఎన్టీఆర్ ముఖ చిత్రం నాణేం కార్యక్రమం పూర్తి కాగానే చంద్రబాబు సీఈసీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe