/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-2-2-jpg.webp)
TDP Chief Chandrababu: నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రాప్తాడులో రోడ్ షో తోపాటు బస్టాండ్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసింగించనున్నారు.