TDP-BJP: పొత్తుల పార్టీల్లో అసమ్మతి.. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి మధ్య అసమ్మతి కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిపై బీజేపీ ఇంచార్జీ మురహరి రెడ్డి విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 05 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి మధ్య అసమ్మతి సెగ కనిపిస్తోంది. ఎమ్మిగనూరు టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిపై బీజేపీ ఇంచార్జీ మురహరి రెడ్డి విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాగళం పబ్లిక్ మీటింగ్ కి సమాచారం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి టీడీపీ పిలువని పేరంటానికి వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. సంబంధం లేని వారిని పిలుచుకొని బీజేపీ కండువాలు వేసి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులకు తమ అవసరం లేదేమోనని పేర్కొన్నారు. బీజేపీగా ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తామని టీడీపీకి మా సత్తా చూపిస్తామని అంటున్నారు. ఎమ్మిగనూరు టీడీపీ వన్ సైడ్ లవ్ చేస్తోందని ఎద్దేవ చేశారు. మరోవైపు, కావాలనే బీజేపీ ఇంచార్జీ మురహరి రెడ్డి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని కామెంట్స్ చేశారు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి. ప్రజాగళం సభకు అందరిని ఆహ్వానించారని తెలిపారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. #kurnool-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి