TDP Buddha Venkanna: చంద్రబాబు, పవన్ పై చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తా.. బుద్దా వెంకన్న వార్నింగ్

విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఈ సందర్భంగా కేశినేని నానిపై మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ గురించి చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రండి..మీరో మేమో చూసుకుందామని సవాల్ విసిరారు.

TDP Buddha Venkanna: చంద్రబాబు, పవన్ పై చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తా.. బుద్దా వెంకన్న వార్నింగ్
New Update

TDP Buddha Venkanna: విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేత బుద్దా వెంకన్న బల ప్రదర్శన చేపట్టారు. టిక్కెట్ టీడీపీకి కేటాయించి.. తనకు టిక్కెట్ ఇవ్వాలని దుర్గమ్మ గుడి వరకు తన అనుచరులతో ర్యాలీ చేశారు. విజయవాడ పశ్చిమం కాకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా కేటాయించాలని చంద్రబాబుకు వినతి పత్రం అందించనున్నారు. ఆ దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు.

Also Read: ముద్దనూరు అల్లర్ల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ.!

ఈ ర్యాలీ సందర్భంగా బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానన్నారు. చంద్రబాబు తనకు దైవ సమానులని పేర్కొన్నారు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చినట్లు తెలిపారు. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరానన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళెవరైనా సరే చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

Also Read: నాలుగు సంవత్సరాల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇందుకే ఇచ్చారు: జనసేన శ్రీనివాస్

తనకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానని కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో నిలబడటానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేశినేని నానిపై విమర్శలు గుప్పించారు. కేశినేని అనే కుక్కకు బుద్ధి చెప్పాలనే ర్యాలీగా వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు - పవన్ గురించి చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రండి..మీరో మేమో చూసుకుందామని సవాల్ విసిరారు.

#andhra-pradesh #tdp-budhavenkanna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe