Nandyal: వైసీపీ నాయకులు ధర్నా వద్దకు వెళ్తే జరిగేది ఇదే.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్.! నంద్యాలలో మహిళలు ధర్నా చేస్తుంటే వైసీపీ నాయకులు కనీసం తోంగిచుడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ధర్నా వద్దకు వస్తే తంతారనే భయంతోనే వైసిపి నాయకులు ఇళ్ళ లోనే కూర్చుంటున్నారని ఎద్దెవ చేశారు. By Jyoshna Sappogula 30 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి TDP Bhuma Akhila Priya: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Ex MinisterBhuma Akhila Priya) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు తమ సమస్యలు తీర్చండి అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర అంటూ బస్సు ఎక్కి తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే రోజుల్లో సాధికార యాత్ర బస్సులలో మీరు తిరిగి ఇళ్ళకు వెళ్తారని సెటైర్లు వేశారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో ఓడిపోయిన ఎమ్మెల్యే లను ఓదారుస్తాడని కౌంటర్లు వేశారు. Also Read: ‘అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించాలి’..జగన్ కు లోకేష్ డిమాండ్.! ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని లేదంటే.. అంగన్వాడీ లు ప్రభుత్వాన్ని దింపేయడానికి సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యనించారు. జగన్ పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మంచి చేస్తానని చెప్పి అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ దోచుకోవం సరిపోయింది కానీ ప్రజలకు మంచి చేయడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు అందరూ రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తుంటే పట్టించుకునే నాథుడే లేడని నిప్పులు చెరిగారు. Also Read: ‘పవన్ పెళ్లిళ్ల గురించి కాదు జగన్ .. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో’.. కిరణ్ రాయల్ కౌంటర్.! టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ధర్నాలు చేస్తే మా అధినేత నేరుగా వారి దగ్గరికి వెళ్లి డిమాండ్స్ కనుక్కొమని చెప్పి వాళ్లని అలా వారి సమస్యలు తీర్చే వాళ్ళమని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. నంద్యాలలో మైయిన్ రోడ్డు పై ఇంతమంది ధర్నా చేస్తుంటే వైసిపి నాయకులు తోంగిచుడటం కూడా లేదని..వైసిపి నాయకులు ధర్నా వద్దకు వస్తే తంతారనే భయంతో ఇళ్ళ లోనే కూర్చుంటున్నారని ఎద్దెవ చేశారు. #andhra-pradesh #tdp-bhuma-akhila-priya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి