TDP Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో గంజాయి కలకలం రేపుతోంది. పలువురు యువకులు గంజాయి సేవిస్తుండగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు గుర్తించారు. అయితే, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరార్ అయ్యారు. ఈ ఘటనపై స్పందించిన భూమా అఖిల ప్రియ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువత గంజాయి మత్తులో మునిగి తేలుతుంటే ప్రభుత్వం, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి వాడకం జరుగుతోందని అఖిల ఆరోపించారు.
Also read: టీడీపీలో పరిటాల కుటుంబ తీరుపై ఉత్కంఠ..!
టిట్కో గృహాల వద్ద చిన్న పిల్లలు గంజాయిని సేవిస్తూ నా కంటపడటం బాధ కలిగిస్తుందన్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. మాదకద్రవ్యాలు బ్రెజిల్ దేశం నుండి పెద్ద కంటైనర్ లో మన దేశానికి రావడం చూస్తుంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం కావడం లేదన్నారు. దీని వెనకాల బలమైన వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. బ్రెజిల్ ప్రధానికి విజయసాయిరెడ్డి కంగ్రాట్యులేషన్స్ చెప్పవలసిన అవసరం ఏముంది దీని వెనకాల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
Also Read: మనుషులందరికీ షాకింగ్ న్యూస్.. బర్డ్‌ఫ్లూతో విద్యార్థి మరణం!
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా గంజాయి అసాంఘిక కార్యకరాపాలతో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని ఆరోపించారు. యువతను డ్రగ్స్ కు అలవాటు చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తామన్నారు.