B.Tech Ravi: వివేకా కేసులో బిటెక్ రవి షాకింగ్ కామెంట్స్..

వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నార్కో అనాలసిస్ పరీక్షకు అవినాష్‌ సిద్ధమా అని టీడీపీ అభ్యర్థి బిటెక్ రవి ప్రశ్నించారు. తాను ఈ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్ముంటే అవినాష్ కూడా నార్కో అనాలసిస్‌కి ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు.

New Update
B.Tech Ravi: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి

B.Tech Ravi Comments on Viveka Case: వైఎస్ వివేకా కేసుపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బి టెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. నార్కో అనాలసిస్ పరీక్షకు నేను సిద్ధం అవినాష్ సిద్ధమా అంటూ  సవాల్ విసిరారు. లైవ్ లో రాష్ట్రం మొత్తం చూసేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్ కి ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. కేసు సీరియస్ గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతాడన్నారు. తాను నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి సీఎం జగన్ సునీతకి అసలు విషయాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. కేసులో జగన్ హస్తం ఉందనేది తొందరలో బయటకు వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకానంద రెడ్డిని చంపే సమయంలో వీడియో తీసి పెట్టారనే సమాచారం ఉంది కాబట్టి జగన్ చెప్పగలిగాడన్నారు. హత్య చేయడానికి గొడ్డలి ఖర్చు ఫోన్ పే ద్వారా దస్తగిరికి సునీల్ కుమార్ యాదవ్ పంపాడని వ్యాఖ్యానించారు. బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్ కి విషయం ఎలా తెలిసింది అని ప్రశ్నించారు. లెటర్ సృష్టించారు అని ఆ రోజు జగన్ చెప్పాడు తిరిగి ఆ లెటర్ పై నానా రాద్ధాంతం చేస్తున్నది జగనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన జగన్ సొంత బాబాయ్ కేసు ఎందుకు తేల్చలేదని నిలదీశారు. కేసు ముందుకు పోవద్దని అఫిడవిట్ వేసింది సీఎం జగన్ అని పేర్కొన్నారు.

Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!

ఉదయ్ కుమార్ రెడ్డి తల్లికి ఉదయం 5 గంటలకు ఎలా తెలిసిందో తెలియాలన్నారు. సునీతా రెడ్డి ప్రజల మద్దతు కోరడంతో జగన్ అభద్రతకు లోనయ్యారని..ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత వస్తుందేమో అని జగన్ కి భయం మొదలయ్యిందన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టింది జగన్ అని.. కేశినేని నాని.. కేశినేని చిన్ని విషయంలో చూసామని వ్యాఖ్యానించారు. పులివెందులలో అభద్రతా ఉంది కాబట్టి సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారని తెలిపారు. సునీత రెడ్డి పార్టీలోకి వస్తుందనే ఆలోచనతో వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి వెళ్లినట్టు స్వయంగా ఒప్పుకున్నాడని..అయితే ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ప్రజలే గమనించాలని సూచించారు. రూ. 20 కోట్లు ఆఫర్ ఇచ్చిన విషయంలో దస్తగిరి సీబీఐని ఆశ్రయిస్తున్నారని..కేసులో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు