Atchannaidu on NTR: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అమరావతిలో apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఘాటుగా సమాధానం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి అంటూ మేము ఎవరినీ అడగమని ఆయన అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ (Skill Development Case) లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతోనే apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ఓపెన్ చేసామన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. హైదరాబాద్,విజయవాడ లాంటి ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఎంత ఆందోళన కనిపించిందో అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో ప్రజలందరూ రోడ్డపైకి వస్తున్నారని తెలిపారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతుందని దుయ్యబట్టారు.
నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైట్ లో పొందుపరిచామని అచ్చెన్నాయుడు తెలిపారు . ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంను అభినందించిన కేంద్రం అందుకు తగ్గట్టు అవార్డులు కూడా ఇచ్చిందని చెప్పారు. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వైసీపీ (YSRCP) చేస్తున్న దుష్ప్రచారం పై వాస్తవాలు తెలియజేయాలని వెబ్ సైట్ తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిరసనకు దిగుతున్నారన్నారు. ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైందిని ఆయన అన్నారు.
జనసేన (Janasena)తో పొత్తుపై స్పందిస్తూ..రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు. ఏ మాత్రం సంబంధం లేని కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యనమల,నిమ్మల రామానాయుడు, తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Also Read: చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రికి రజనీకాంత్