/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/ap-tdp-president-atchannaidu-controversial-comments-on-ycp-govt-in-mahanadu.jpg)
TDP Atchannaidu: ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారని ఆరోపించారు.
Also Read: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ కి బెయిల్! లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ వైరల్!!
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్), ఎన్జీటి నిర్దారించాయని తెలిపారు. అయినా జగన్ రెడ్డి ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500 కి పైగా రీచ్ ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.
Also Read: కావ్య చేష్టలకు కుళ్ళి కుళ్ళి చస్తున్న భర్త.. రాజ్ పై అనామిక మాస్టర్ స్కెచ్
ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆందోళనలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన శ్రేణులు రీచ్ ల వద్ద నిరసనలు తెలపటంతో పాటు వైసీపీ అక్రమ ఇసుక దోపిడిని ఫోటోలు, సెల్పీల రూపంలో ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి