TDP-Janasena: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత వవన్ కల్యాణ్‌ అధికారికంగా ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేపటి నుంచే ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పవన్ స్పష్టంచేశారు. దీంతో జనసైనికులు, పసుపు కార్యకర్తలు యుద్ధానికి రెడీ అంటున్నారు. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్నారు.

New Update
TDP-Janasena: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన

TDP-Janasena Allianace: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) అధికారికంగా ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేపటి నుంచే ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పవన్ స్పష్టంచేశారు. దీంతో జనసైనికులు, పసుపు కార్యకర్తలు యుద్ధానికి రెడీ అంటున్నారు. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్నారు. జగన్‌ (YS Jagan)ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కేసులు, మరోవైపు విమర్శల దాడితో సైలెంట్ అయిపోయారు. అయితే యువనేత లోకేష్ (Lokesh) పాదయాత్రతో టీడీపీ క్యాడర్‌లో మళ్లీ జోష్ వచ్చింది. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది.

ప్రభుత్వ వేధింపులతో రగిలిపోతున్న జనసైనికులు..

మరోవైపు జనసేన పార్టీ క్యాడర్ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసైనికులపై అక్రమ కేసులు, నిర్బంధాలు చేయడంతో ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అలాగే తొలి నుంచి వైసీపీ నేతలు జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ సినిమాల రిలీజ్ విషయంలో టికెట్లు తగ్గించడం, బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పవన్ విశాఖ వచ్చినప్పుడు బయటకు రానీయకుండా హోటల్‌లోనే పోలీసులు నిర్బంధించడంపై పవన్ మండిపడ్డారు. మరోవైపు వారాహి యాత్ర (Varahi Yatra) లో కూడా పవన్‌ను ఇబ్బంది పెట్టడం.. పవన్ వైసీపీ నాయకులపై తీవ్ర అవినీతి విమర్శలు చేయడంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత విజయవాడ రావాలనుకున్న పవన్‌ను అడుగుడుగునా అడ్డుకున్నారు. విమానం టేకాఫ్‌కు అనుమతి ఇవ్వకపోవడం, రోడ్డు మార్గాన వచ్చినా ఏపీ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పవన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Also Read: స్కీల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్..

సరైన సందర్భం రావడంతో అధికారిక ప్రకటన..

ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశ్యంతో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేయాలని పవన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు- పవన్‌లు మూడు సార్లు భేటీ అయ్యారు. అయితే బీజేపీ కలిసి రావడానికి మొగ్గు చూపకపోవడంతో పొత్తుపై మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సయంలో పొత్తుల ప్రకటనకు సరైన సందర్భం కావాలని వేచి చూస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రాజమండ్రి జైలులో పెట్టడం చకచకా జరిగిపోయాయి. ఇదే సరైన సందర్భం అని భావించిన పవన్.. టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ అరాచకాలు అడ్డుకోవడానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొత్తు నిర్ణయం కేవలం జనసేన, టీడీపీ భవిష్యత్తు కోసం కాకుండా రాష్ట్రం భవిష్యత్తు కోసం అని పవన్ వెల్లడించారు.

ఢీ అంటే ఢీ అనేలా రాష్ట్ర రాజకీయాలు..

టీడీపీ-జనసేన కలిసి పోటీచేయకూడదని అధికార వైసీపీ భావిస్తూ వచ్చింది. ఈ క్రమంలో దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలని ఇరు పార్టీలను రెచ్చగొడుతూ వచ్చారు. ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా 2014 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని భయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొత్తులు ఖారారు కావడంతో ఇక నుంచి రాష్ట్ర రాజకీయాలు ఢీ అంటే ఢీ అనేలా ఉండనున్నాయి.

Also Read:  వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్

Advertisment
Advertisment
తాజా కథనాలు