/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
టీడీఎల్పీ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 11న టీడీఎల్పీ భేటీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత, కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని గవర్నర్ కు అందిస్తారు. ఆ మరుసటి రోజు ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉందన్న చర్చ సైతం సాగుతోంది.