Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. 2,400 సంస్థల్లో జాబ్స్.. అప్లై చేసుకోండిలా..!

ఉద్యోగాల కోసం వేటలో ఉన్న ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది టీసీఎస్‌. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT)ను నిర్వహిస్తుంది. TCS - NQTలో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌ సంస్థలతో పాటు మరో 2,400 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. 2,400 సంస్థల్లో జాబ్స్.. అప్లై చేసుకోండిలా..!
New Update

ఏ జాబ్‌కి అప్లై చేసుకున్నా ముందుగా అడిగే ప్రశ్న 'మీకు ఎక్స్‌పిరియన్స్‌ ఉందా'. అందుకే ఫ్రెషర్లకు జాబ్‌ రావాలంటే చాలా కష్టం. ట్రైనింగ్‌ ఇచ్చి, వర్క్‌ నేర్పించి పని చేయించుకోవడం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహరం..అందుకే టెక్‌ కంపెనీలు ఎక్కువగా అనుభవం ఉన్నవాళ్లని రిక్రూట్‌ చేస్తుంటాయి. అయితే మరి ఫ్రెషర్ల సంగతేంటి..? వాళ్లు ఎప్పటికీ నిరుద్యోగులకు మిగిలిపోవాల్సిందేనా.? లేదు లేదు..అలాంటి వారి కోసమే ఈ వార్త..ఇలాంటి వారికోసమే దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో IT ఇంజనీరింగ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT)ను నిర్వహిస్తుంది. TCS - NQTలో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌ సంస్థలతో పాటు మరో 2,400 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. NQT 2023 పరీక్షకు ఇంజినీరింగ్‌, ఆర్ట్స్, కామర్స్‌, సైన్స్‌ గ్రాడ్యయేట్స్‌ అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2023 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 12, 2023 తేదీ నుంచి దేశవ్యాప్తంగా TCS ..NQT 2023 పరీక్షను నిర్వహించనున్నారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పూర్తి వివరాలివే:
అర్హత: ఇంజినీరింగ్‌, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులు
ఎంపిక విధానం: నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ (NQT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ స్కోరుకు 2 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జులై 31, 2023
TCS NQT 2023 పరీక్ష తేది: ఆగస్టు 12, 2023

TCS NQT 2023 పరీక్షా విధానం:
TCS NQT పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.

పరీక్షకు సంబంధించిన వివరాలు:
వర్బల్‌ ఎబిలిటీ : 24 ప్రశ్నలు - 30 నిమిషాలు
రీజనింగ్‌ ఎబిలిటీ: 30 ప్రశ్నలు - 50 నిమిషాలు
న్యూమరికల్‌ ఎబిలిటీ : 26 ప్రశ్నలు - 40 నిమిషాలు
ప్రోగ్రామింగ్‌ లాజిక్ : 10 ప్రశ్నలు - 15 నిమిషాలు
కోడింగ్‌ - 02 ప్రశ్నలు : 45 నిమిషాలు

TCS NQT కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు TCS Next Step పోర్టల్‌లో నమోదు ద్వారా TCS NQT కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష కోసం సైన్ అప్ చేయడానికి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా వారి క్రెడెన్షియల్స్ ఉపయోగించి పాత ఖాతాకు లాగిన్ చేయవచ్చు. నమోదు చేసుకునేటప్పుడు అభ్యర్థులు పరీక్ష మోడ్‌ను ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. వారు పరీక్షను ఎంపిక చేసిన కేంద్రంలో లేదా రిమోట్‌గా కూడా రాయవచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe