గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న టీబీజేపీలో చైతన్యం పెరిగింది. తెలంగాణ బీజేపీలో అసమ్మతికి, అలకలకు చెక్ పెడుతూ, పార్టీ అధిష్టానం నాయకత్వంలో మార్పులు చేర్పులు చేసింది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇప్పటి వరకూ టీబీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవటం ద్వారా నాయకుడిగా సంజయ్ కే కాదు, పార్టీలో ఆయన అభిమానులనూ సంతృప్తి పరిచింది. ఇప్పుడిక ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీసింది. ఇతర పార్టీల్లో నేతలను బీజేపీలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 4గురు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంది. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నటి జయసుధ కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యిందని చెబుతున్నారు. ఆమె బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకె అరుణ, ఈటల రాజేందర్ లు అధిష్టానం పిలుపుపై ఢిల్లీ వెళ్లారు. దేశరాజధానిలో అగ్రనేతల సమక్షంలో పార్టీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి.
పూర్తిగా చదవండి..ఢిల్లీలో టీ బీజేపీ సందడి: 4 గురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక
తెలంగాణ కాంగ్రెస్ నుంచి నలుగురు ప్రముఖులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ నేతల సమక్షంలో ఈ చేరికలు సాగాయి. ఇప్పుడు బీజేపీలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది.

Translate this News: