ఢిల్లీ నుంచి బండి సంజయ్‎కు కబురు...ఏదో జరుగుతోంది..!!

బీజేపీ హైకమాండ్ తెలంగాణపై నజర్ పెట్టింది. నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో నిమగ్నమైంది. నిన్నగాక మొన్న ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచిన అధిష్టానం..ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పెట్టింది. దీంతో ఉన్నఫలంగా బండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

New Update
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే..!!

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య సమన్వయలోపాన్ని కుదిర్చే పలోని పడింది బీజేపీ అధిష్టానం. ఈ తరుణంలోనే మొన్న ఈటెల రాజేందర్, లగడపాటి రాజగోపాల్ ను ఢిల్లీకి పిలిచిన బీజేపీ పెద్దలు..ఇప్పుడు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురందించింది. దీంతో వెంటనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే సంజయ్ ను ఢిల్లీకి పిలవడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపాలాడించాలని బీజేపీ పెద్దలు చూస్తుంటే ఇక్కడి నేతలు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

BANDI SANJAY

రాష్ట్ర బీజేపీ నేతల తీరు అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే తెలంగాణ బీజేపీకి కొన్ని మరమ్మత్తులు చేయడం మొదలుపెట్టింది అధిష్టానం. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచి వారితో మాట్లాడింది. తర్వాత బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిచింది. ఢిల్లీ పెద్దలు పిలవడంతో వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు సంజయ్. అయితే ఇప్పుడు బండి సంజయ్ ను ఎందుకు ఢిల్లీ పిలిచారన్నది హాట్ టాపిగ్గా మారింది.

అటు కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో తెలంగాణ బీజేపీలో కూడా జోరు తగ్గినట్లుగా కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో మాదే అధికారమంటూ ధీమాతో ఉన్న బీజేపీలో నిరాశ కలిగిసతోంది. ఇంతలోనే పార్టీలో సమన్వయ లోపం, విభేధాలు, అసంత్రుప్తులుకూడా తెరపైకి వస్తుండటంతో దీన్ని సెటిల్ చేసేందుకు ఏకంగా రంగంలోకి దిగింది హైకమాండ్. దీనిలో భాగంగా ఒక్కొక్కర్నీ ఢిల్లికి పిలుచుకుని మాట్లాడుతున్నారు పెద్దలు.

మొన్న తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకూడా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పార్టీలో ఎవరెవరు అసంత్రుప్తితో ఉన్నారో తెలుసుకున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు, కీలక నిర్ణయాల్లో తమను పట్టించుకోవడం లేదని జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారట కొంతమంది నేతలు. కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ ప్రకటించాలని సూచించారు. ఇవన్నీచూస్తుంటే తెలంగాణపై బీజేపీ హైకమాండ్ బలంగానే ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తోంది. పార్టీ నేతలను బుజ్జిగిస్తూ..మరోవైపు తీరు మార్చుకోవాలంటూ సున్నితంగా హెచ్చరిస్తూ వస్తోంది. మున్ముందు బీజేపీ హైకమాండ్ తెలంగాణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది..ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే..

Advertisment
Advertisment
తాజా కథనాలు