సోషల్ మీడియా వింగ్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వివిధ జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుబంధ సంఘాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. By BalaMurali Krishna 25 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి సోషల్ మీడియా టీంపై తీవ్ర ఆగ్రహం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా టీంతో నిర్వహించిన సమావేశంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సోషల్ మీడియా టీంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. కొంతమంది నేతల పనితీరుపై అసహనం.. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే కొంతమంది గ్రేటర్ కార్పొరేటర్ల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తరుచుగా బీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలను కలవడంపై ఆరా తీశారు. పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. అలాగే ఎన్నికల 100 రోజుల ప్రణాళికలో నేతల పనితీరును సమీక్షిస్తామని తెలిపారు. మరోవైపు పార్టీ అనుబంధ సంఘాల ప్రస్తుత అధ్యక్షులనే కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టంచేశారు. సీనియర్ల మధ్య బయటపడ్డ విభేదాలు.. అటు ఇటీవల అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే అధ్యక్షుడి మార్పు జరిగిందనే కోణంలో ఆయన మాట్లాడినట్లు చర్చించుకుంటున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయించుకోవాలని హితవు పలికారు. ఇక వేదికమీదే ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు. నేతలతో అమిత్ షా వరుస భేటీలు.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీనియర్ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆయన వేర్వేరుగా సమావేశమ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు. వరుసగా ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29న అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి