TATA Vehicles: టాటా కమర్షియల్ వెహికిల్స్ ధరలు పెరిగాయి.. ఎంత అంటే.. 

టాటా వాహనాల ధరలు పెరుగుతున్నాయి.. కమర్షియల్ వెహికల్స్ ధరలు 3 శాతం పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో టాటా పాసింజర్ వాహనాలు కూడా ధరలు పెరుగుతాయి. ఎంత పెరగవచ్చు అనేది ఇంకా కంపెనీ వెల్లడించలేదు. టాటాతో పాటు హొండా, మారుతి కూడా వాహనాల ధరలను పెంచుతున్నట్టు చెప్పాయి. .  

TATA Vehicles: టాటా కమర్షియల్ వెహికిల్స్ ధరలు పెరిగాయి.. ఎంత అంటే.. 
New Update

TATA Vehicles: టాటా మోటార్స్ తన అన్ని వాణిజ్య వాహనాల ధరలను 3% పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ధరలను ఎంత మేర పెంచుతారనే సమాచారం మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇది కాకుండా, దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కొత్త సంవత్సరం నుంచి  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్(TATA Vehicles) పోర్ట్‌ఫోలియోలో హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో నుంచి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) సఫారి వరకు ఉన్నాయి. వీటి ధర రూ.5.6 లక్షల నుంచి రూ.25.94 లక్షల మధ్య ఉంటుంది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. 

ఆడి కార్ల ధరలు 2% పెరగనున్నాయి..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్‌లో తమ వాహనాల ధరలను 2% పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇన్‌పుట్ - నిర్వహణ ఖర్చులు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ పేర్కొంది. కొత్త ధరలు జనవరి 1, 2024 నుంచి అన్ని మోడళ్లపై వర్తిస్తాయి.

Also Read: ఇథనాల్ కోసం చెరకు రసం ఉపయోగించడంపై నిషేధం 

"సరఫరా గొలుసు సంబంధిత ఇన్‌పుట్‌లు - మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా, బ్రాండ్ ప్రీమియం ధర స్థానాలను నిర్వహించడానికి మేము మా మోడళ్లలో ధర సవరణలు చేసాము" అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. ఆడి ఇండియా భారతదేశంలో Q3 SUV నుంచి స్పోర్ట్స్ కారు RSQ8 వరకు వివిధ రకాల వాహనాలను విక్రయిస్తుంది, వీటి ధర రూ. 42.77 లక్షల నుండి రూ. 2.22 కోట్ల మధ్య ఉంది.

జనవరి 2024 నుంచి రుతీ కార్లు కూడా.. 

మారుతి సుజుకి తన లైనప్‌లో ఉన్న అన్ని వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు తయారీ ఖర్చులతో పాటు ద్రవ్యోల్బణం-నియంత్రణ అవసరాలు కారణమని కంపెనీ పేర్కొంది.పెరిగిన ధరలు జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మారుతీ సుజుకీ ధరల పెరుగుదల స్థాయిని ధృవీకరించలేదు.  అయితే మోడల్‌కు అనుగుణంగా ధరలు వేర్వేరుగా పెరుగుతాయని సమాచారం.

మారుతీ ఈ ఏడాది మూడోసారి ధరలను పెంచింది

మారుతి సుజుకీ ఈ ఏడాది మూడోసారి తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఏప్రిల్ 1న, అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచారు. అదే సమయంలో, జనవరి 16, 2023న, అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు 1.1% పెరిగాయి. అప్పుడు కూడా ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో వాహనాల ధరలు పెరిగాయి.

Watch this interesting Video:

#tata-group #vehicles
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe