Tata Motors Share: టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది.. 

టాటా మోటార్స్ ఈ సంవత్సరం ట్రేడింగ్ చివరి రోజు దుమ్మురేపింది. నిముషాల వ్యవధిలో 11,500 కోట్ల రూపాయల విలువను పెంచుకుంది. ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. 

New Update
Tata Motors Share:  టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది.. 

Tata Motors Share Price: రతన్ టాటాకు (Ratan Tata) అత్యంత ఇష్టమైన టాటా మోటార్స్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు దుమ్ము దులిపే పెర్ఫార్మెన్స్ చేసింది.  నిమిషాల వ్యవధిలో షేర్ విలువ అమాంతం పెరిగిపోయింది. శుక్రవారం ట్రేడింగ్  ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.11,500 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక  మొత్తం సంవత్సరం గురించి చెప్పుకుంటే, కంపెనీ షేర్లు 100 శాతానికి పైగా అంటే రూపాయికి రూపాయి లాభాన్ని తెచ్చిపెట్టాయి. కంపెనీ (Tata Motors)షేర్లు ఇన్వెస్టర్లకు రెట్టింపు ఆదాయాన్ని అందించాయి. రానున్న రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కంపెనీ షేర్లు ఏ స్థాయికి చేరుకున్నాయో, కంపెనీ వాల్యుయేషన్ ఎక్కడికి చేరిందో కూడా తెలియజేద్దాం.

రికార్డు స్థాయిలో టాటా మోటార్స్ షేర్లు

టాటా గ్రూప్‌కు చెందిన మోటార్ కంపెనీ టాటా మోటార్స్ షేర్లు (Tata Shares) ఈ ఏడాది చివరి ట్రేడింగ్ రోజున రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డేటా ప్రకారం, కంపెనీ షేర్లు 6.41 శాతం పెరుగుదలతో రోజు గరిష్ట స్థాయి రూ.802.60కి చేరుకున్నాయి. అయితే మధ్యాహ్నం 1:45 గంటలకు కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం లాభంతో రూ.783.75 వద్ద ట్రేడవుతున్నాయి. ఒక రోజు క్రితం కంపెనీ షేర్లు రూ.754.20 వద్ద ముగిశాయి. అయితే ఈరోజు కంపెనీ షేర్లు తొలిసారిగా రూ.800 స్థాయిని దాటాయి.

Also Read: హైదరాబాద్ లో ఇల్లు కొనడమంటే కష్టమే గురూ.. దేశంలోనే ఎక్కువ ధరలు!

11,500 కోట్ల మేర వాల్యుయేషన్ పెంపు

టాటా మోటార్స్  వాల్యుయేషన్ గురించి చూస్తే, కంపెనీ షేర్లలో విపరీతమైన పెరుగుదల ఉంది. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకోగా, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,62,056.34 కోట్లకు చేరుకుంది. ఒక రోజు ముందు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,50,561.47 కోట్లుగా ఉంది. అంటే షార్ట్ ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.11494.87 కోట్ల పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ రూ.2,60,428.14 కోట్లకు చేరుకుంది.

కంపెనీ రెట్టింపు ఆదాయాన్ని ఆర్జించింది

ప్రస్తుత సంవత్సరంలో టాటా మోటార్స్(Tata Motors share) షేర్లు రెండింతలు పెరిగాయి. అంటే టాటా మోటార్స్ ఇన్వెస్టర్ల ఆదాయాలు రెట్టింపు అయ్యాయి. గతేడాది చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ (Stock Market) ముగిసే సమయానికి కంపెనీ షేరు రూ.388.10గా ఉంది. ఆ తర్వాత పెరుగుదల కనిపించి కంపెనీ షేర్ రూ.802.60కి వచ్చింది. అంటే కంపెనీ షేర్లు 107 శాతం పెరిగాయి

Watch this interesting Video:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు