Tamin Iqbal: బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కరోజులోనే యూ టర్న్‌ తీసుకున్న తమీమ్‌ ఇక్బాల్..!

బంగ్లాదేశ్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. మాజీ కెప్టెన్ త‌మీమ్ ఇక్బాల్ యూ ట‌ర్న్ తీసుకున్నాడు. ఒక్క‌రోజులోనే అత‌ను రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. ఈరోజు ప్ర‌ధాని షేక్ హ‌సీనాను క‌లిసిన అత‌ను త‌న అభిప్రాయం మార్చుకున్నాడు.

Tamin Iqbal: బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కరోజులోనే యూ టర్న్‌ తీసుకున్న తమీమ్‌ ఇక్బాల్..!
New Update

తమీమ్‌ ఇక్బాల్‌ షాహిద్‌ అఫ్రిదిని ఫాలో అయ్యాడు. అదేంటి.. తమీమ్‌.. అఫ్రిదిని అనుసరించడమేంటని ఆలోచిస్తున్నారా.. అదేనండి.. మనోడు ఎమోషనల్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు కదా.. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అది కూడా ఒక్కరోజులోనే. తమీమ్‌ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే బాధ పడ్డ బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఖుషీ అవుతున్నారు. రానున్న వరల్డ్‌ కప్‌ వరకు తమీమ్‌ బంగ్లా జట్టుతోనే ఉండనున్నాడు.

publive-image బంగ్లా ప్రధాని హసీనాతో తమీమ్ దంపతులు

ప్రధానిని కలిసిన తర్వాత నిర్ణయం వెనక్కి:
బంగ్లాదేశ్‌ క్రికెట్‌కి 16ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమీమ్‌ అఫ్ఘాన్‌తో తొలి వన్డే ఓటమి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తమీమ్‌ బంగ్లాదేశ్‌ ప్రధానిని షేక్ హ‌సీనాను కలిసేందుకు వెళ్లాడు. మాజీ క్రికెట‌ర్, పార్ల‌మెంట్ స‌భ్యుడు ముష్ర‌ఫే మొర్తాజా, తమీమ్‌ భార్య అయేషా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్య‌క్షుడు న‌జ్మ‌ల్ హుసేన్‌తో క‌లిసి హ‌సీనా నివాసానికి వెళ్లాడు. తమీమ్‌ నిర్ణయం పట్ల అందరి ఫ్యాన్స్‌ లాగే హసీనా కూడా బాధ పడ్డారు. తొందర పాటు నిర్ణయం వద్దని సూచించారు. ఎమోషనల్‌గా తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు అని.. వరల్డ్‌ కప్‌కి ఇంకా మూడు నెలలే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ కప్‌ వరకు ఆడాలని కోరారు. హసీనా అభ్యర్ధన మేరకు ఈ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీలో ఆడేందుకు తమీమ్‌ అంగీకరించాడు. వెంటనే తన నిర్ణయాన్ని ఫ్యాన్స్‌కి పంచుకున్నాడు. రిటైర్మెంట్‌ని తమీమ్‌ వెనక్కి తీసుకోవడంతో బంగ్లాదేశ్‌ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.

publive-image షేక్ హసీనాతో తమీమ్

యూ టర్న్‌ కింగ్ అఫ్రిది:
క్రికెట్‌ రిటైర్మెంట్‌లో ఎవరూ యూ టర్న్‌ తీసుకున్నా అందరికి పాక్‌ లెజండరీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదినే గుర్తొస్తాడు. అతని కెరీర్‌లో ఏకంగా 5సార్లు రిటైర్మెంట్‌ ప్రకటించాడు అఫ్రిది. నాలుగు సార్లు తన రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకున్నాడు. అఫ్రిది 2006లో క్రికెట్‌కు వీడ్కోలు పలికి రెండు వారాలకే వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 2010లో మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. 2011 ప్రపంచకప్ తర్వాత మళ్లీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న షాహిద్ అఫ్రిదీ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత 2015లో, చివరకు 2017లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక అఫ్రిది ఒక్కడే కాదు.. యూటర్న్‌ తీసుకున్న ఆటగాళ్లలో మొయిన్‌ అలీ, అంబటి రాయుడు కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ రెండేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఆడేందుకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe