Cricket: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ ప్లేయర్.. 2007ప్రపంచకప్‌లో టీమిండియాను ఇంటికి పంపిన ఆటగాడు

మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న సమయంలో బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్ షాక్‌ ఇచ్చాడు. అన్నీఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ ప్రయాణంలో నిరంతరం తనతో ఉంటూ తనపై నమ్మకం ఉంచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పిన తమీమ్‌ కన్నీంటి పర్యంతమయ్యాడు.

New Update
Cricket: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ ప్లేయర్.. 2007ప్రపంచకప్‌లో టీమిండియాను ఇంటికి పంపిన ఆటగాడు

2007 వన్డే ప్రపంచకప్ భారత్‌ క్రికెట్ అభిమానులకు ఓ పీడకల. టీమిండియా అభిమానులు ఇప్పటికీ వేధిస్తున్న వరల్డ్ కప్‌ అది. అప్పటి రోజులను గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇండియన్‌ టీమ్‌ టోర్నీ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఓడిపోవడంతో తర్వాత బెర్ముడాపై గెలిచినా..లీగ్‌ చివరి మ్యాచ్‌ శ్రీలంక చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది! నిజానికి రెండు స్ట్రాంగ్‌ టీమ్స్‌, రెండు చిన్న టీమ్స్‌ కలయికతో ఐసీసీ గ్రూప్స్‌ని విభజించింది. మన గ్రూప్‌లో బంగ్లాదేశ్‌, బెర్ముడా చిన్న జట్లు. ప్రతి గ్రూప్‌ నుంచి రెండు టీమ్స్‌ తర్వాతి రౌండ్‌కి వెళ్తాయి. ఇండియా, శ్రీలంక ఈజీగా నెక్ట్స్ గ్రూప్‌కి వెళ్తాయని అంతా భావించగా..బంగ్లాదేశ్‌ ఇచ్చిన షాక్‌తో టీమిండియా తెల్లబోయింది. నాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు 49.3ఓవర్లలో 191పరుగులకు ఆలౌట్ అవ్వగా.. బంగ్లాదేశ్‌ 48.3ఓవర్లలో టార్గెట్‌ని ఛేజ్‌ చేసి ఇండియాకు షాక్‌ ఇచ్చింది. స్లో పిచ్‌పై 53బంతుల్లోనే 51పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఇన్నింగ్స్‌ విలువెంటే ఎవర్ని అడిగినా చెబుతారు. 16 ఏళ్లగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌కి మరుపురాని విజయాలు అందించిన తమీమ్‌ ఇక్బాల్ ఇప్పుడు రిటైర్‌ అవుతున్నారన్న వార్త బంగ్లాదేశ్‌ అభిమానులను షాక్‌కి గురిచేసింది.

ఏడ్చేసిన తమీమ్‌:
మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న సమయంలో తమీమ్‌ ఇక్బాల్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. జూలై 5న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో బంగ్లాదేశ్ ఓడిపోయిన తర్వాత రోజు(జులై6) తమీమ్‌ ఈ ప్రకటన చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ ప్రయాణంలో నిరంతరం తనతో ఉంటూ తనపై నమ్మకం ఉంచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పిన తమీమ్‌ కన్నీంటి పర్యంతమయ్యాడు. టీవీలో తమీమ్‌ భావోద్వేగానికి గురవడం చూసిన బంగ్లాదేశ్‌ అభిమానులు ఏడ్చేశారు. దేశం కోసం తాను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశానని..తన కెరీర్‌కి సహకరించిన సహచరులు, కోచ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు థ్యాంక్స్‌ చెప్పాడు తమీమ్‌.

బంగ్లాదేశ్‌ గర్వించదగ్గ ఆటగాడు:
2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తమీమ్‌ ఇక్బాల్‌, 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 69 టెస్టులు, 238 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 10 సెంచరీలతో 5,082 పరుగులు చేసిన తమీమ్‌ ఇక్బాల్‌, వన్డేల్లో 14 సెంచరీలతో 8,224 పరుగులు చేశాడు. టీ20ల్లో ఓ సెంచరీ, 3 హాఫ్‌ సెంచరీలతో 1,758 పరుగులు చేశాడు. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా రికార్డు తమీమ్ పేరుపైనే ఉంది. ఇక తమీమ్‌ చేసిన ఎక్కువ హాఫ్‌ సెంచరీలు ఇండియాపైనే ఉన్నాయి. అన్ని ఫార్మాట్ల‌లో బెస్ట్ ప్లేయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న తమీమ్‌ 2020లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 37 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 21 విజయాలు అందుకున్నాడు. జనవరి 2022లో టీ20ల నుంచి ఆరు నెలల బ్రేక్‌ తీసుకున్న తమీమ్‌ ఇక్బాల్‌, 2022 జూన్‌లో టీ20ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించగా..తాజాగా క్రికెట్‌ కెరీర్‌కి ముగింపు పలకడం అభిమానులకు చాలా బాధపెడుతోంది. వరల్డ్‌ కప్‌ టీమ్‌ని ముందుండి నడిపిస్తాడని భావించిన ఫ్యాన్స్‌ తమీమ్‌ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు