Ram Mandir: నిర్మలమ్మ గుస్సా...స్టాలిన్ సర్కార్ వివరణ..!!

స్టాలిన్ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. రామ్‌లల్లా పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించిందన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది.

Ram Mandir: నిర్మలమ్మ గుస్సా...స్టాలిన్ సర్కార్ వివరణ..!!
New Update

Ram Mandir: రేపు (సోమవారం జనవరి 22) అయోధ్యలో రామమందిరం (Ram Temple)ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సామాన్య భక్తుల నుంచి 8వేల మంది వీఐపీల వరకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ ఏర్పాట్లతోపాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట(Prana prathista)కు సంబంధించిన కార్యక్రమాన్ని దేశంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ రోజును గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అదే సమయంలో, చాలా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.జనవరి 22న రామ్‌లల్లా పట్టాభిషేకం కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. స్టాలిన్ ప్రభుత్వం(Stalin's government)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర ఆరోపణ చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు.

ప్రాణ-ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసింది: నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి ట్విటర్‌లో ఇలా వ్రాశారు. "జనవరి 22న రాంలల్లా పవిత్రోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. తమిళనాడులో 200 కంటే ఎక్కువ శ్రీరాముని ఆలయాలు ఉన్నాయి.(HR&CE) నిర్వహించే దేవాలయాలలో శ్రీరాముని పేరు మీద పూజ/భజన/ప్రసాదం/అన్నదానం అనుమతించబడవు. ప్రైవేట్‌గా నిర్వహించే ఆలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు నిలిపివేస్తున్నారు. పండల్‌ను కూల్చేస్తామంటూ నిర్వాహకులను బెదిరిస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేక, ద్వేషపూరిత చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారు: కేంద్ర మంత్రి
తమిళనాడు నుంచి ఎన్నో బాధాకరమైన విషయాలు తెలుస్తున్నాయన్నారు నిర్మల సీతారామాన్. భజనలు నిర్వహించడం, పేదలకు భోజనం పెట్టడం, మిఠాయిలు ఇవ్వకూడదంటూ రామభక్తులను బెదిరిస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ సమయంలో పవర్ కట్ అయ్యే అవకాశం ఉందని కేబుల్ టీవీ ఆపరేటర్లకు తెలిపారు. ఇది భారత కూటమి, దాని మిత్రపక్షమైన DMK చేసిన హిందూ వ్యతిరేక ప్రయత్నం అంటూ ఫైర్ అయ్యారు.

publive-image

శాంతిభద్రతలు క్షీణింస్తాయని డీఎంకే ఆరోపిస్తోంది:
కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “అనధికారిక ప్రత్యక్ష ప్రసార నిషేధాన్ని సమర్థించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం శాంతిభద్రతలు క్షీణిస్తాయని పేర్కొంది.ఇదంతా కట్టుకథ. అయోధ్య తీర్పు రోజు (సుప్రీంకోర్టు తీర్పు) శాంతిభద్రతలకు ఎటువంటి సమస్య లేదన్నారు.మోదీ రామాలయం శంకుస్థాపన చేసినరోజు దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్య లేవనెత్తలేదు. ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకునేందుకు తమిళనాడు ప్రజలు స్వచ్చందం్గా పాల్గొనడం, వారి మనోభావాలను దెబ్బతీయడం, హిందూ వ్యతిరేకులు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈ వాదన నిరాధారమైనది: డీఎంకే నేత
కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది. తమిళనాడులోని ఏ ఆలయంలో పూజలు నిర్వహించడం లేదా రాముడికి అన్నదానం చేయడంపై HR&CE ఎలాంటి నిషేధం విధించలేదని HR&CE మంత్రి శేఖర్ బాబు తెలిపారు. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్లు వాస్తవ విరుద్ధమైన వదంతులను ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు.

publive-image

రాముడి పేరుతో పూజలు: మంత్రి పీకే శేఖర్ బాబు
తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘డీఎంకే యువజన సమ్మేళనాన్ని పక్కదారి పట్టించేందుకు పక్కా ప్రణాళికతో పుకార్లను ప్రచారం చేస్తున్నారు.రాముడి పేరుతో భక్తులపై ధర్మాదాయ శాఖ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. తమిళనాడులోని దేవాలయాల్లో పూజలు చేయండి, ఆహారం ఇవ్వండి లేదా ప్రసాదం కూడా ఇవ్వండి.ఉన్నత పదవుల్లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి వ్యక్తులు పూర్తిగా తప్పుడు సందేశాలను ప్రచారం చేయడం విచారకరమని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: వారి ఉద్యోగాలకు ఎసరు..ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!!

#nirmala-sitaraman #ram-mandir #stalin-governament #prana-prathista
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి