Tamilanadu: తమిళనాడులో ఘోరం..కల్తీసారా తాగి 26మంది మృతి

తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి 18 మంది మృతి చెందగా..ఆసుపత్రిలో 60 మంది చికిత్స పొందుతుండగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.దీంతో మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.

New Update
Tamilanadu: తమిళనాడులో ఘోరం..కల్తీసారా తాగి 26మంది మృతి

Tamilanadu: తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి 18 మంది మృతి చెందగా..ఆసుపత్రిలో 60 మంది చికిత్స పొందుతుండగా వారిలో 30మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. సారా దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్‌ అయిన ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్తీ సారా తాగి 18 మంది మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ..రాష్ట్రంలో కల్తీసారా యథేచ్చగా దొరుకుతుందని , రాష్ట్రం కల్తీసారాకి అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం పళని స్వామి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు.

కల్తీసారా తాగి ఒక్కసారిగా 18 మంది మృతి చెందడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీసారా విక్రయాల పై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఈ ఘటన గురించి పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

కల్తీసారా ఘటనపై సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి. కల్తీ మద్యానికి కారణమైన వారిని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గురించి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.జిల్లా ఎస్పీ సమయసింగ్‌మీనాపై సస్పెన్షన్‌ అధికారులు వేటు వేశారు. జిల్లా కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ బదిలీకి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. చెన్నై నుంచి కళ్లకురిచ్చికి బయల్దేరిన 18ప్రత్యేక బృందాలు. జిల్లాలోని ఎక్సైజ్‌ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Also read: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు