తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య అరెస్ట్‌, ఖండించిన బీజేపీ..!!

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మధురై సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిన్న అర్థరాత్రి అరెస్ట్ చేశారు. మధురై ఎంపీపై చేసిన ట్వీట్ కారణంగా ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

New Update
తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య అరెస్ట్‌, ఖండించిన బీజేపీ..!!

తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను ముద్రై జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మధురై ఎంపీ వెంకటేశన్‌పై ఎస్‌జీ సురేష్‌ ట్వీట్‌ చేశారు. దీని ఆధారంగా మధురై సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిన్న అర్థరాత్రి ఎస్ జీ సురేష్‌ను అరెస్ట్ చేశారు. ఎస్‌జీ సూర్యపై ఐపీసీ 153(A), 505 (1)(B), 505 (1)(సీ) సెక్షన్లు, 66(D) ఐటీ చట్టం కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ కోరుతూ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

Tamilnadu bjp state secretary sg-surya arrest

అదే సమయంలో, ఎస్‌జి సూర్య అరెస్టును బిజెపి ఖండించింది. హేయనీయమైన చర్య అని పేర్కొంది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలై ట్వీట్ చేస్తూ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్య అరెస్టును తీవ్రంగా ఖండిచారు. సామాజిక సమస్యలపై డిఎంకె దాని సంకీర్ణ భాగస్వాముల ద్వంద ప్రమాణాలను బట్టబయలు చేసినందకే సూర్యను అరెస్టు చేశారన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలను ఎవరైనా విమర్శిస్తే అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నామలై అన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి సంరక్షకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడం ద్వారా అన్ని భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు ప్రయత్నించడం చాలా కాలం కొనసాగదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఇది నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. ప్రజల కోసం మా గొంతు ఎప్పుడూ నిర్భయంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన పాలనలో రాష్ట్రాన్ని అక్రమార్కులుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు