IAS Officer : డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతారు..లాయర్ల పిల్లలు లాయర్లు అవుతారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ వారసులుగా ఎదుగుతారు. హీరోల వారసులు, వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ స్టార్ నటుడి కుమారుడు అందరికీ భిన్నంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.
తమిళ నటుడు(Tamil Actor) చిన్ని జయంత్(Chinni Jayanth) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన కమెడియన్‌గా(Comedian), క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తమిళం మాత్రమే కాకుండా..తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి ఆయనకంటూ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.
ఆయనకి శృతన్ జయ నారాయణన్(Sruthanjay Narayanan) అనే కొడుకు ఉన్నాడు. చిన్ని జయంత్ ఆర్టిస్టు కాబట్టి ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ శృతన్ అందుకు భిన్నంగా వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. అది ఏంటంటే..చదువు. ప్రస్తుతం ఆయన్ని అందరూ ఐఏఎస్ నారాయణన్ గా పిలుస్తున్నారు.
మొదటి నుంచి కూడా శృతన్ గమ్యం వేరు. ఆయన వేసిన అడుగులు వేరు..వాటి వల్లే నేడు ఇంతటి విజయాన్ని సాధించడం జరిగింది. ముందు నుంచి కూడా చదువుల్లో ఆయన టాపర్ గా ఉన్నారు. దీంతో శృతన్ తల్లిదండ్రులు కూడా ఆయన ఆలోచనను ప్రోత్సాహించారు.
మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తరువాత ఆయన ఓ స్టార్టప్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగంలో చేరాడు.
ఆ సమయంలో ఆయన కేవలం రాత్రిపూట ఉద్యోగం చేసుకుంటూ.. పగలంతా కూడా చదువుకుంటూ ఉండేవారు. అలా రోజులో 10 గంటలకు కేవలం చదువుకి కేటాయించి యూపీఎస్సీ పరీక్షల్లో 2015లో విజయం సాధించారు. ఆల్ ఇండియా లెవల్లో 75వ ర్యాంకు సాధించడం అంటే చిన్న విషయం కాదు.
ప్రస్తుతం శృతన్ త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం శృతన్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
Also read: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..15 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది!