Chutney Sambar: కమెడియన్ యోగి బాబు 'చట్నీ- సాంబార్'.. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో..!

తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ 'చట్నీ-సాంబార్'. తాజాగా ఈ సీరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రాధా మోహన్ తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ డిస్నీ హాట్ స్టార్ లో విడుద‌ల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

New Update
Chutney Sambar: కమెడియన్ యోగి బాబు  'చట్నీ- సాంబార్'.. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో..!

Yogi Babu Chutney Sambar Movie: సినిమా అంటే హీరోలు మాత్రమే చేయాలనేది ఒక్కప్పుడి ట్రెండ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కమెడియన్స్ హీరోలుగా, హీరోలు విలన్లుగా, ఇలా పాత్రకు తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేసే రోజులు వచ్చాయి. ఇదే తరహాలో ఇటీవలే కమెడియన్ అజయ్ గోష్ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

'చట్నీ సాంబార్'

అయితే తాజాగా మరో స్టార్ కమెడియన్ సరి కొత్త వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ 'చట్నీ సాంబార్'. రాధా మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ సిరీస్ త్వరలో ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Hotstar) విడుద‌ల కానుంది.

'చట్నీ సాంబార్' ఫస్ట్ లుక్

ఈ నేపథ్యంలో తాజాగా 'చట్నీ సాంబార్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చట్నీ సాంబార్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతోంది ఈ సీరీస్. విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ సిరీస్‌లో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించగా.. వాణీ భోజన్‌, షాడోస్ రవి, మైనా నందిని, దీపా శంకర్, సంయుక్తా విశ్వనాథ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Also Read: Kalki 2898 AD: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్‌ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు