Vishal: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) లాంటి గొప్ప నాయకుడినే.. అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు సినీ హీరో విశాల్. చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని చెప్పుకొచ్చారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రం రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో నేడు హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో విశాల్ కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రస్తావించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు కొంచెం అలోచించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యనించారు.చంద్రబాబు నిజాయతీ గల నేత అని.. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుల పరిస్ధితి ఏంటని అన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని విశాల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే విశాల్ చిన్నతనం సాగింది. గతంలో విశాల్ కుప్పం రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, వైసీపీ నుంచి బరిలోకి దిగి చంద్రబాబు పై పోటీ చేయనున్నాడని జోరుగా ప్రచారం కూడా జరిగింది. గతంలో తనకి జగన్ అంటే ఇష్టమని విశాల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు చంద్రబాబు గురించి హీరో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాజీ సీఎం చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పై సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు స్పదించగా.. అటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు.
Also Read: శ్రుతి హాసన్‌ను వెంబడించిన అజ్ఞాత వ్యక్తి..! భయపడి పరుగులు పెట్టిన హీరోయిన్..!!