Tamarind Leaves: చింతాకు తింటే ఈ చింతలన్ని తీరుతాయి!

చింత చిగురు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింత చిగురును తీసుకోవడం వల్ల షుగర్‌ కంట్రోల్‌ అవ్వడమే కాకుండా, మలబద్ధక సమస్యలు కూడా తీరతాయని నిపుణులు అంటున్నారు.

New Update
Tamarind Leaves: చింతాకు తింటే ఈ చింతలన్ని తీరుతాయి!

చింత చిగురు (Tamarind Leaves) గురించి తెలియని వారుండరు..కేవలం చింతకాయలకు మాత్రమే కాకుండా చింత చిగురుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆకును కూరల్లో ఉపయోగిస్తారు. చింతచిగురు పప్పు వండితే ఎంతో ఇష్టంగా తింటారు. చింత చిగురు సంవత్సరం మొత్తం దొరకదు కాబట్టి దానిని ఎండబెట్టి నిల్వ బెట్టుకుంటారు కొందరు.

చింతపండు బదులు కూడా ఈ ఎండబెట్టిన దానిని కూరల్లో వేసుకుంటుంటారు. చింత చిగురు రక్త హీనతను తగ్గిస్తుంది. రక్తం పెరిగేలా చేస్తుంది. కామెర్ల నివారణకు చింత చిగురు మంచి ఔషధం. మూల వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది.

మల బద్దకం సమస్యను తొలగిస్తుంది. ఫైల్స్‌ సమస్యతో బాధపడే వారికి చింతపండు మంచి ఉపకారి. చింత చిగురు వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. థైరాయిడ్‌ తో బాధపడే వారు కూడా చింతచిగురును తమ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు.

శరీరంలో ఎర్ర రక్త కణాలను అందించడమే కాకుండా రక్తాన్ని శుద్ది చేస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. షుగర్‌ వ్యాధిగ్రస్తులు చింత చిగురు తింటే షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ ను పెంచుతుంది.

గొంతునొప్పి, మంట, చలి జ్వరం , వాపులను తగ్గించడంలో చింత చిగురు మంచి ఔషధం. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది.
ఆర్ధరైటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. నేత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ళవాపు సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.

Also Read: శీతాకాలంలో నల్ల నువ్వులను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా!

Advertisment
తాజా కథనాలు