Tamannaah Bhatia: ఫుల్ జోష్‌ లో మిల్కీ బ్యూటీ..మరో హీరోతో లక్కీ ఛాన్స్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా న్యూ ఇయర్ ఫొటోలను షేర్ చేసింది. లండన్ టూర్ కు సంబంధించిన పిక్స్ ను తాజాగా పంచుకుంది ఈ బ్యూటీ. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న తమన్నా మరో సీనియర్ హీరోతో నటించేందుకు లక్కీ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది.

Tamannaah Bhatia: ఫుల్ జోష్‌ లో మిల్కీ బ్యూటీ..మరో హీరోతో లక్కీ ఛాన్స్
New Update

Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, వెబ్ సెరీస్ లు చేస్తూ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూంది. తాజాగా మిల్కీ బ్యూటీ నెటిజన్లనూ ఫిదా చేసేలా తన ఫొటోలను పంచుకుంది.

publive-image

న్యూ ఇయర్ కు సంబంధించి లండన్ టూర్ లో దిగిన కొన్ని రేర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇష్టమైన ఫుడ్ తింటూ.. డ్రింక్స్ తాగుతూ లండన్​ ట్రిప్​ని ఎంజాయ్ చేస్తుంది తమన్నా.

publive-image

దాదాపు 18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఏలుతుంది ఈ అమ్మడు. మిల్కీ అందాలతో టాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీస్‌లో తన సత్తా చూపెడుతోంది. వన్నె తగ్గని అందంతో తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు. త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీఠలు ఎక్కబోతుందంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

publive-image

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో చేసిన ‘జైలర్’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఫ్లాప్ అయింది. అయితే, తమన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో సీనియర్ హీరో సరసన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు  వార్త వినిపిస్తోంది.

publive-image

Also Read: కలిసి రాని కాలం..డల్ అయిన ఐకాన్ స్టార్ బ్యూటీ..!

#tamannaah-bhatia
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe