తాలిబాన్ కొత్తగా కాబూల్, దేశవ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళ బ్యూటీపార్లర్ లపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తాలిబాన్ వైస్ అండ్ వర్య్చుల మంత్రిత్వశాఖ ప్రతినిధి మహ్మద్ అకిఫ్ మహజర్ అక్కడి స్థానిక మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. తాలిబాన్ నాయకుడు చెప్పిన కొత్త డిక్రీని అమల్లోకి తీసుకురావలని..మహిళల బ్యూటీ పార్లర్ల లైసెన్సులు రద్దు చేయాలని తాలిబాన్ వైస్, ధర్మ మంత్రిత్వ శాఖ కాబూల్ మున్సిపాలిటీని ఆదేశించింది.
మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు:
తాలిబాన్ డిక్రీ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ రెహాన్ ముబారిజ్ మాట్లాడుతూ, “పురుషులుకు ఉద్యోగాలు లేవు. పురుషులు తమ కుటుంబాన్ని చూసుకోలేనప్పుడు, ఆడవాళ్లు చేసేపనివాళ్ల కుటుంబం గడుస్తుంది. అక్కడ కూడా నిషేధం విధిస్తే…మేం చేయాలి? మగవారికి ఉద్యోగాలు ఉంటే మేమేందుకు బయటకు వస్తాము. ఇప్పుడు ఏం చేయమంటారా. ఆకలితో చావమంటారా? మేము చనిపోవాలని మీరు కోరకుంటున్నారా అంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ ప్రశ్నించారు.
విద్య, వినోదంపై ఇప్పటికే నిషేధం:
ఇస్లామిక్ ఎమిరేట్ బాలికలు, మహిళలు పాఠశాలలు, కళాశాలలకు హాజరుకాకుండా, NGOలు, యు పార్కులు, చలనచిత్రాలు, ఇతర వినోద ప్రదేశాలు వంటి బహిరంగ ప్రదేశాలలో పనిచేయడాన్ని ఇప్పటికే నిషేధించింది. కాబూల్ నివాసి అబ్దుల్ ఖబీర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం దీని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలి. ఫ్రేమ్‌వర్క్ ఇస్లాం లేదా దేశానికి హాని కలిగించని విధంగా ఉండాలి.”అన్నారు.
ఈద్ వేడుకలకు వెళ్లడంపై నిషేధం:
ఏప్రిల్‌లో మరో తాలిబాన్ ఆర్డర్‌లో, ఈద్ వేడుకలకు హాజరుకాకుండా మహిళలను నిషేధించారు. నివేదికల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లోని రెండు ప్రావిన్సులలో ఈ నిషేధం విధించారు. ఖమా ప్రెస్ ప్రకారం, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా బగ్లాన్, తఖర్‌లోని మహిళలు గుంపులుగా బయటకు వెళ్లకుండా నిషేధించారు. ఆఫ్ఘన్ మహిళలపై తాలిబాన్ నిషేధం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం తెప్పిస్తోంది.