Sabja Seeds:ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టట్టం చాలా ముఖ్యం. వేసవి కాలంలో అయితే మరీ శరీరంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అయితే మనం ఏం తిన్నా కానీ వాటిలో కొద్దిగైనా శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు అందే విధంగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాంటి ప్రోటీన్లు పుష్కలంగా కలిగిన వాటిల్లో సబ్జా గింజలు ఒకటి. ఇవి అందరికీ తెలిసిన విత్తనాలే. అయితే వీటిని పరిగడుపున తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో వీటిని తాగితే శరీరంలో వేడి తగ్గటంతో పాటు మూత్రంలో మంట, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇంకా సబ్జా గింజలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం
ఉదయం కాళీ కడుపుతో తాగితే కలిగే ప్రయోజనాలు
సబ్జా గింజల్ని అరగంటసేపు ఒక గ్లాస్ వాటర్లో ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. వారంలో అప్పుడప్పుడు ఇలా తీసుకుంటుంటే శరీరంలో వేడి తగ్గి రోగనిరోధకశక్తి అధికంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టురాలటం, చర్మ , చుండ్రు మొదలైన సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిల్లో ఫైబర్, ప్రోటీన్లు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీటిని వేసవిలో తీసుకుంటే వికారం, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా అధిక బరువు తగ్గటంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థానాలను అదుపులో ఉంచి బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయాలి? వేడి నీరు నిజంగా మంచిదేనా?