Hair Mehndi: జుట్టుకి మెహందీ పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటిపండులో మెహందీ కలిపి జుట్టుకు పెట్టుకుంటే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అంతేకాదు కొబ్బరిపాలు, ఆలివ్‌ ఆయిల్‌ను మెహందీలో కలిపి జుట్టుకు పట్టించాలి. తలలో దురదపెడుతోన్న దగ్గర ఈ పేస్ట్‌ రాసి, 30 నిమిషాల తరువాత కడిగాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతాయి.

Hair Mehndi: జుట్టుకి మెహందీ పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
New Update

Hair Mehndi: జుట్టు అందంగా ఉండటం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, జుట్టు ఎక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు కూడా బాగా రాలిపోతుంది. దీనికోసం రకరకాల షాంపులు, మందులు వాడుతూ ఉంటారు. అయితే మెహందీలో కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం తెలుసా..? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మెహందీలో ఇవి కలిపితే..

అరటిపండులోని ఎన్నో రకాల పోషకాలున్నాయి. దీనిని మెహందీలో కలిపి జుట్టుకు పెట్టుకుంటే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండుని మెత్తగా చేసి మెహందీలో కలపి జుట్టుకి పట్టించి గంట తరువాత తల స్నానం చేయాలి. అంతేకాదు కొబ్బరిపాలు, ఆలివ్‌ ఆయిల్‌ను మెహందీలో కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టుకు మంచిగా పెరుగుతుంది. వీటిల్లో మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. హెన్నా, ముల్తానీ మట్టి కలిపి పేస్టులా చేసుకోవాలి. తలలో దురదపెడుతోన్న దగ్గర ఈ పేస్ట్‌ రాసి, 30 నిమిషాల తరువాత కడిగాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతాయి.

హెన్నా రాసేముందు ఈ జాగ్రత్తలు అవసరం

మెహందీతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరూ అనుకుంటారు. కానీ.. దీనిని ఎలా అప్లై చేయాలి..? ఎంత సమయం పెట్టాలో చాలామందికి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. అయితే.. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోవద్దు.. ముందు రోజు రాత్రే కనీసం 5-6 గంటల పాటు స్టోర్‌ చేయాలి. హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే.. అంత బాగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందంటారు. కానీ.. ఇలా ఎక్కువ సేపు ఉంచితే.. హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది.. దీంతో జుట్టు విపరీతంగా పొడిగా అవుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. పొడి జుట్టు మీద మెహందీ రాస్తే జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే హెన్నాను నెలకు ఒకసారి మాత్ర పెట్టుకుంటే మంచది అతిగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #mehndi-hair
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe