Seasonal Allergies: వర్షాకాలంలో అనేక వ్యాధులు వస్తాయి. వర్షం కారణంగా కాలానుగుణ అలెర్జీతోపాటు తుమ్ములు, కళ్లలో దురదలు, రద్దీ వంటి సమస్యలు అధికం ఉంటాయి. ఈ సమస్య కొందరిలో సర్వసాధారణంగా ఉంటే కొందరిలో తీవ్రంగా ఉండి రోజువారీ పనికి అంతరాయం కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ఎవరికైనా అలర్జీ రావచ్చు. అందుకని ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షం కారణంగా అలర్జీలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వర్షాకాలంలో వ్యాధులు తగ్గాలంటే:
- ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకోవాలి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్, అలెర్జీ తగ్గించి రోగనిరోధకశక్తిని, పనితీరు మెరుగుపడుతుంది. ఆహారంలో సాల్మన్, చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి తీసుకోవడం మంచిది. ఇవి అలెర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆహారంలో ఆరెంజ్, క్యాప్సికమ్, బ్రోకలీ, కివీ, స్ట్రాబెర్రీలను చేర్చుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- పెరుగు, పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోకుంటే అలర్జీ సమస్య తగ్గుతుంది.
- బాదం, గుమ్మడి గింజలు, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, అవకాడోలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలర్జీని నివారించడానికి, రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపడటానికి మేలు చేస్తాయి.
- పసుపు, అల్లం, ఆకు కూరలు, బెర్రీలు, ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అలెర్జీని దూరం చేస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి పనిచేస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి? నిర్లక్ష్యం చేయవద్దు!