Seasonal Allergies: వర్షాకాలంలో అలర్జీలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! వర్షాకాలంలో అలెర్జీ, తుమ్ములు, కళ్ల దురదల సమస్య అధికంగా ఉంటుంది. ఆహారంలో చియా విత్తనాలు, గుమ్మడి, అవిసె గింజలు, వాల్‌నట్స్, ఆరెంజ్, కివీ, స్ట్రాబెర్రీ, బాదం, బచ్చలికూర, అవకాడో వంటివి చేర్చుకుంటే ఈ సమస్యలు దూరం చేసుకోవచ్చు. By Vijaya Nimma 13 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Seasonal Allergies: వర్షాకాలంలో అనేక వ్యాధులు వస్తాయి. వర్షం కారణంగా కాలానుగుణ అలెర్జీతోపాటు తుమ్ములు, కళ్లలో దురదలు, రద్దీ వంటి సమస్యలు అధికం ఉంటాయి. ఈ సమస్య కొందరిలో సర్వసాధారణంగా ఉంటే కొందరిలో తీవ్రంగా ఉండి రోజువారీ పనికి అంతరాయం కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ఎవరికైనా అలర్జీ రావచ్చు. అందుకని ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షం కారణంగా అలర్జీలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. వర్షాకాలంలో వ్యాధులు తగ్గాలంటే: ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకోవాలి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్, అలెర్జీ తగ్గించి రోగనిరోధకశక్తిని, పనితీరు మెరుగుపడుతుంది. ఆహారంలో సాల్మన్, చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి తీసుకోవడం మంచిది. ఇవి అలెర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆహారంలో ఆరెంజ్, క్యాప్సికమ్, బ్రోకలీ, కివీ, స్ట్రాబెర్రీలను చేర్చుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పెరుగు, పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోకుంటే అలర్జీ సమస్య తగ్గుతుంది. బాదం, గుమ్మడి గింజలు, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, అవకాడోలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలర్జీని నివారించడానికి, రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపడటానికి మేలు చేస్తాయి. పసుపు, అల్లం, ఆకు కూరలు, బెర్రీలు, ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అలెర్జీని దూరం చేస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి పనిచేస్తాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి? నిర్లక్ష్యం చేయవద్దు! #seasonal-allergies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి