Ananathapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో ఐదు ఫ్యాక్టరీలు విడుదల చేసే దుమ్ము, పొగ వల్ల పంట చేతికందక తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దీంతో స్పందించిన బొమ్మనహాల్ తహశీల్దార్ స్థానిక రైతన్నలతో కలిసి క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించారు.
Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..!
పంటలపై ఎర్రటి దుమ్ము, దూళి అధికంగా పడుతున్న విషయం వాస్తవమని తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులతో నియమ నిబంధనలు విషయమై మాట్లాడి రైతులతో సైతం సమస్యలపై నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామన్నారు.
Also Read: ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి..!
సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున రైతుల సమస్యలను తహశీల్దార్ కి వివరిస్తుండగా సంబంధిత ఫ్యాక్టరీ యజమానులు తాము అన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నామంటూ చెప్పడంతో.. ఎవరికి ఏం న్యాయం చేస్తున్నారో చెప్పాలంటూ సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ప్రశ్నించారు. దీంతో రైతన్నలకు ఫ్యాక్టరీ యజమానులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.