ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : యార్లగడ్డను వైసీపీ అవమానించిందా? పొమ్మనలేక పొగపెట్టిందా? వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ గరం గరంగా గన్నవరం రాజకీయం... యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా? Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By BalaMurali Krishna 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ! ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్ కల్యాణ్! నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Drugs in AP : మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. పార్లమెంట్ సాక్షిగా వెలువడిన లెక్కలు! పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Flexi Issue : అమలాపురంలో ఫ్లెక్సీల వార్.. వైసీపీ ఆగ్రహం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వార్ నడుస్తోంది. అమలాపురం సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీలు వార్ నెలకొంది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించపోవటంతో ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. By Vijaya Nimma 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Comments on Chandrababu : ఏం చేయలేమని తెలిసిందే కాబట్టే..ఇలాంటి చర్యలు! కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు: పురంధేశ్వరి! బీజేపీ ఏపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn