AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది.
ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడగడపకూ మన ప్రభుత్వం మీద పార్టీ నేతలు, సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. ఇందులో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు.
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
జగనన్న ఆరోగ్య సురక్ష అనే గొప్ప పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు.