World Animal Day 2023: అంతర్జాతీయ జంతు దినోత్సవం.. భూమి మనుషులది మాత్రమే కాదు బాసూ..!
ప్రతిఏడాది అక్టోబర్ 4న ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి జంతు ప్రేమికులు ప్రపంచ జంతు దినోత్సవం వేడుకలో పాల్గొంటారు.