Weather Alert : రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 12.8, పటాన్చెరు 13.2, ఆదిలాబాద్లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడురోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.