Bandi Sanjay: టార్గెట్ 16... మరోసారి బండి సంజయ్ యాత్ర
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరో సారి యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10 నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టనున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొండగట్టులో మొదలై తంగళ్లపల్లిలో ఈ యాత్ర ముగియనుంది.